ఇరాక్‌లో వేల సంవత్సరాల నాటి బాబిలోనియన్ స్తోత్రం పునఃశోధన

వేల సంవత్సరాల క్రితం బాబిలోన్‌లో రచించబడిన ఒక స్తోత్రం ఇరాక్‌లో తిరిగి కనుగొనబడింది. ఈ స్తోత్రం బాబిలోన్ నగరం యొక్క వైభవాన్ని కీర్తిస్తూ రచించబడింది.
ఇందులోని వివరణలు ఆ కాలంలోని జీవన విధానం గురించి, ముఖ్యంగా మహిళల పాత్ర గురించి (యాజకురాలిగా) చక్కని అవగాహనను అందిస్తుంది. శాస్త్రవేత్తలు AI సహాయంతో ఈ స్తోత్రానికి సంబంధించిన 30 ప్రతులను గుర్తించారు.
ఇది సాధారణ పద్ధతుల ద్వారా అయితే దశాబ్దాల కాలం పట్టేది. 250 పంక్తులతో కూడిన ఈ పూర్తి స్తోత్రం వివరణాత్మకంగా అర్థం చేసుకోబడింది.
అనేక ప్రతులు దొరకడం వల్ల ఈ స్తోత్రం ఎంతో ప్రాచుర్యంలో ఉండేదనీ, పాఠశాల విద్యార్థులు కూడా దీన్ని కాపీ చేసేవారనీ తెలుస్తుంది. బాబిలోనియన్ వ్యక్తి తన నగరాన్ని స్తుతించి వ్రాసిన ఈ స్తోత్రంలో, నగర నిర్మాణాలు, యూఫ్రేటిస్ నది యొక్క జలాల వైభవం గురించి వివరించబడింది.
మెసోపొటేమియా సాహిత్యంలో ఇలాంటి సహజ దృశ్యాల వివరణలు చాలా అరుదు. అంతేకాకుండా, బాబిలోనియన్లు విదేశీయులను ఎంతగా గౌరవించేవారో కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది.
ఈ ప్రతులు క్రీ. పూ 7వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం వరకు చెందినవి.
సిప్పార్ గ్రంథాలయం నుండి వచ్చినవని నమ్ముతున్నారు. వరదల నుండి కాపాడుకోవడానికి వాటిని దాచి ఉంచారని భావిస్తున్నారు.
క్రీ. పూ 2000 సంవత్సరాలకు పూర్వం స్థాపించబడిన బాబిలోన్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా, ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉండేది.